E.G: జానపద సాహిత్యంలో చేసిన కృషికి రాజమండ్రికి చెందిన ప్రముఖ కవి సన్నిధానం నరసింహశర్మకు ఆచార్య బిరుదురాజు రామరాజు జానపద విజ్ఞాన పురస్కారం లభించింది. తెలంగాణ జానపద సాహిత్య పరిషత్తు 2026 సంవత్సరానికి ఆయనను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు ప్రధాన కార్యదర్శి చిగిచర్ల కృష్ణారెడ్డి తెలిపారు. అక్టోబర్ 2న హైదరాబాద్‌లో ఈ పురస్కారం అందజేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్
రాజమండ్రి వాసికి విశిష్ట పురస్కారం


