హైదరాబాద్: 28°C
తెలంగాణ

మాలు నాయక్ కుటుంబానికి పరామర్శ

NLG: దామరచర్ల మండలం కల్లేపల్లి గ్రామానికి చెందిన శ్రీ బంగారు మైసమ్మ ఆలయ పెద్ద పూజారి ధీరావత్ మాలు నాయక్ ఇటీవల మృతి చెందారు. ఆదివారం మాజీ MLA నల్లమోతు భాస్కర్‌ రావు ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. మాలు నాయక్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో పలువురు స్థానికులు, నాయకులు పాల్గొన్నారు.