KMM: త్రీటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బర్మాషెల్ రోడ్డులో ఆదివారం ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన స్థితిలో కనిపించారు. మృతుడి వయసు సుమారు 60 ఏళ్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. నీలం షర్టు, లుంగీ ధరించి ఉన్నట్లు పేర్కొన్నారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
తెలంగాణ
బర్మాషెల్ రోడ్డులో వ్యక్తి మృతి


