SKLM: వజ్రపుకొత్తూరు మండలం పూండిలోని సాగర్ కాలనీలో చోరీ ఘటన కలకలం రేపింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు పై అంతస్తులోకి ప్రవేశించి సూట్‌కేసులో భద్రపరిచిన మూడు తులాల బంగారం, రూ.15 వేల నగదును అపహరించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఆదివారం కాశీబుగ్గ డీఎస్పీ టీ.భవాని, సీఐ తిరుపతిరావు ఘటనాస్థలాన్ని పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
పూండిలో కలకలం రేపిన బంగారం చోరీ


