ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియానికి హైదరాబాద్ వేదిక కానుంది. భారత్ ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాల విస్తీర్ణంలో 1.32 లక్షలకు పైగా సీట్ల సామర్థ్యంతో ఈ స్టేడియాన్ని నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ స్టేడియాన్ని రూపొందించేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లో శంకుస్థాపన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
క్రీడలు
HYDలో ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం..!


