హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణపతి ఉత్సవ కమిటీలతో సమావేశం: DSP

ADB: జిల్లా కేంద్రంలోని తానిషా గార్డెన్‌లో సెప్టెంబర్ 1న ఉదయం 10:30 గంటలకు గణపతి ఉత్సవ కమిటీల సమన్వయ సమావేశం నిర్వహించనున్నట్లు DSP జీవన్ రెడ్డి ఆదివారం తెలిపారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆదిలాబాద్ SP అఖిల్ మహాజన్ హాజరవుతారని వెల్లడించారు. ఈ సందర్భంగా మండపాల నిర్వాహకులు, హిందూ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని సూచించారు.