అన్నమయ్య: పుల్లంపేట మండలంలోని అనంతసముద్రం, వడ్డుపల్లి, అగ్రహారం గ్రామాల్లో పోలీసులు డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. పేకాట, కోళ్ల పందేలు, గంజాయి, బహిరంగ మద్యం సేవనంపై పర్యవేక్షణ చేపట్టారు. అనుమానాస్పద కదలికలపై వెంటనే చర్యలు తీసుకుంటామని, ప్రజలు సమాచారాన్ని పోలీసులకు అందించాలని కోడూరు రూరల్ సీఐ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పుల్లంపేటలో డ్రోన్లతో పోలీసుల నిఘా


