హైదరాబాద్: 28°C
తెలంగాణ

అమ్మవార్లను దర్శించుకున్న ఎమ్మెల్సీ మల్లన్న

RR: సైదాబాద్ వడ్డెర బస్తీ బోనాల వేడుకల్లో టీఆర్పీ చీఫ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పాల్గొన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్. భవన వెంకటేష్ ఆహ్వానంతో స్థానిక ఈదమ్మ, ముత్యాలమ్మ దేవాలయాలను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రజలకు ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థించారు. బోనాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీక అని పేర్కొన్నారు.