ADB: విద్యార్థులు చదువుపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా విద్యాధికారి మాధవి అన్నారు. ఆదివారం గాదిగూడ మండలంలోని లోకారి గ్రామంలో చదువుపై అవగాహన సదస్సు నిర్వహించారు. పిల్లలు చదువును మధ్యలోనే నిలిపివేయకుండా ఉన్నత చదువులు నేర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ విద్యార్ధి సంఘం జిల్లాధ్యక్షుడు పెందోర్ సంతోష్, అశోక్, రవీందర్, జాకు తదితరులున్నారు.
తెలంగాణ
పిల్లలు చదువుపై దృష్టి సారించాలి: మాధవి


