హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రౌడీషీటర్లకు కౌన్సిలింగ్

GNTR: కొల్లిపర మండలంలోని రౌడీషీటర్లకు ఆదివారం ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించినట్లు ఎస్సై ఎన్. సి. ప్రసాద్ తెలిపారు. పాత తప్పులను పునరావృతం చేయకుండా, చట్టాన్ని గౌరవిస్తూ సన్మార్గంలో బాధ్యతాయుత పౌరులుగా జీవించాలని వారికి సూచించారు. కుటుంబ గౌరవాన్ని, సమాజంలో తమ భవిష్యత్తును మనస్సులో ఉంచుకొని చెడు అలవాట్లకు, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలన్నారు.