హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఓటర్లకు నోటీసులతో ఇబ్బంది పెట్టొద్దు'

NLG: ఓటర్ల జాబితా సవరణలో సాంకేతిక లోపాలు, మ్యాపింగ్ పొరపాట్లు, అక్షర దోషాల పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని సీపీఎం నల్గొండ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరరెడ్డి డిమాండ్ చేశారు. జిల్లాలో 2.64 లక్షల మందికి నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా నిరసించారు. ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో 100 నుంచి 200 మందికి నోటీసులు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.