హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

W.G: ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను ఆదివారం కలెక్టర్ నాగరాణి, ఎస్పీ అస్మి పర్యవేక్షించారు. మొగల్తూరులో సీఎం పాల్గొనే ప్రజాసభ వేదిక, క్యాడర్ మీటింగ్ జరిగే ప్రదేశం, హెలిప్యాడ్ ప్రాంతాల్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించి, పర్యటనలో పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.