NLG: చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో కుమ్మరులు ఆదివారం శ్రావణ మాస బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ముత్యాలమ్మ తల్లికి బోనాలు సమర్పించి, వర్షాలు బాగా కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో కుమ్మర సంఘం జిల్లా కమిటీ సభ్యుడు తాడూరు చంద్రం, సర్పంచ్ ఆవుల సుందర్, మాజీ సర్పంచ్ భాస్కర్,కుల పెద్దలు పాల్గొన్నారు.
తెలంగాణ
చిన్నకాపర్తిలో కుమ్మరుల బోనాల పండుగ


