హైదరాబాద్: 28°C
క్రీడలు

ఇమ్రాన్ ఖాన్ జైలు శిక్షపై స్పందించొద్దు: పీసీబీ

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలు శిక్షపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని ఆటగాళ్లకు పీసీబీ స్పష్టం చేసింది. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ఆడుతున్న పాక్ ఆటగాళ్లను ఈ అంశంపై బ్రిటిష్ మీడియా ప్రశ్నించే అవకాశం ఉన్నందున ఈ హెచ్చరిక జారీ చేసింది. ఇమ్రాన్ కుమారులు ఇటీవల మైక్ అథర్టన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన జైలు జీవితంపై ఆరోపణలు చేసిన వేళ ఈ ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.