హైదరాబాద్: 28°C
వార్తలు

ఓటర్లు పత్రాలతో హియరింగ్‌కు హాజరు కావాలి: తహసీల్దార్

MLG: వెంకటాపురం మండలంలోని ఒంటిమామిడి పీఎస్‌ నెం.30 పరిధిలో 130 మంది, రాచపల్లి పీఎస్‌ నెం.48 పరిధిలో 74 మంది ఓటర్లకు సర్‌ కార్యక్రమంలో భాగంగా నోటీసులు జారీ అయ్యాయి. వీరికి సోమవారం తహసీల్దార్, ఎంపీపీ కార్యాలయాల్లో హియరింగ్ నిర్వహించనున్నట్లు తహసీల్దార్ ఎం.వేణుగోపాల్ తెలిపారు. ఓటర్లు తప్పనిసరిగా హాజరై అవసరమైన పత్రాలు సమర్పించాలని కోరారు.