హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కంప్యూటర్ విద్య

WNP: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు ఏఐ, డిజిటల్ విద్యపై అవగాహన కల్పించేందుకు కంప్యూటర్ బోధన అందించనున్నట్లు DIEO నరేంద్రకుమార్ తెలిపారు. తొలి విడతలో పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు రూ.25 లక్షల చొప్పున నిధులు మంజూరయ్యాయని చెప్పారు. కంప్యూటర్ విద్యతో విద్యార్థులకు నైపుణ్యాలు పెంపొందుతాయన్నారు.