హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేపీ రాష్ట్ర కో-కన్వీనర్‌గా ప్రీతి జైన్

KMR: జిల్లా కేంద్రానికి చెందిన 44వ వార్డు కౌన్సిలర్ ప్రీతి జైన్ బీజేపీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం కో-కన్వీనర్‌గా నియమితులయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆదేశాల మేరకు సాంస్కృతిక విభాగం కన్వీనర్ రాజమౌళి గౌడ్ రాష్ట్ర కమిటీని ప్రకటించారు. తన నియామకానికి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి, జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులకు ప్రీతి జైన్ కృతజ్ఞతలు తెలిపారు.