హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి'

AKP: డ్రగ్స్‌, గంజాయి వంటి వాటికి యువత దూరంగా ఉండాలని ఎలమంచిలి టౌన్‌ పోలీసులు సూచించారు. అనుమానితులకు డ్రగ్‌ టెస్టులు నిర్వహించగా కొందరికి గంజాయి సేవించినట్లు నిర్ధారణ కావడంతో అనకాపల్లి డీ-అడిక్షన్‌ సెంటర్‌లో చేర్పించి చికిత్స, కౌన్సెలింగ్‌ అందించినట్లు తెలిపారు. ఎవరైనా మాదకద్రవ్యాలు సేవిస్తున్నట్లు తెలిసినా, అనుమానం ఉన్నా వెంటనే తెలపాలన్నారు.