హైదరాబాద్: 28°C
తెలంగాణ

CI మహేష్‌కు ఘన సన్మానం

KMR: తాడ్వాయి మండలం దేమికలాన్‌కు చెందిన CI మహేష్‌ గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించడంపై గ్రామస్తులు, మిత్రులు హర్షం వ్యక్తం చేశారు. కామారెడ్డిలోని వశిష్ట కళాశాలలో నిర్వహించిన అభినందన సభలో ఆయనను ఘనంగా సన్మానించారు. లడఖ్‌లో 2,100 కిలోమీటర్ల బైక్‌ యాత్ర చేసి అత్యంత ఎత్తైన ఉమ్లింగ్‌ పాస్‌ను అధిగమించినందుకు ఈ గౌరవం దక్కింది.