KMR: మాచారెడ్డి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో రేపు ఉ.10 గంటలకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో గోపి బాబు తెలిపారు. మండల ప్రత్యేక అధికారి అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో మండలంలోని ప్రజలు తమ సమస్యలు, ఫిర్యాదులను అధికారుల దృష్టికి తీసుకురావచ్చు. ప్రజల నుంచి వచ్చే సమస్యలను స్వీకరించి వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులు చర్యలు తీసుకోనున్నారు.
తెలంగాణ
రేపు మాచారెడ్డిలో ప్రజావాణి కార్యక్రమం: ఎంపీడీవో


