హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైలు కింద పడి వ్యక్తి మృతి

కడప నగరంలోని రాయచోటి ఫ్లైఓవర్ సమీపంలో ఆదివారం గూడ్స్ రైలు కింద పడి గుర్తుతెలియని వృద్ధుడు మృతి చెందాడు. కడప రైల్వే ఎస్సై సునీల్‌కుమార్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. మృతుడి వయస్సు సుమారు 60 ఏళ్లు ఉంటుందని, బ్లూ కలర్ టీషర్టు, బ్లూ కలర్ లుంగీ ధరించి, మెడలో తాయత్తు ఉన్నట్లు తెలిపారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు.