ASR: రక్తదానం ప్రాణదానంతో సమానమని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జి ఈశ్వరి అన్నారు. పాడేరులోని కాఫీ హౌస్‌లో ఆదివారం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. అత్యవసర వైద్య సమయంలో రక్తం కొరత లేకుండా రక్త నిల్వలు పెంచే లక్ష్యంతో కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకుడు రవికుమార్ తెలిపారు. శిబిరంలో మొత్తం 23 యూనిట్ల రక్తాన్ని సేకరించారు.
ఆంధ్రప్రదేశ్
మెగా రక్తదాన శిబిరంలో 23 యూనిట్లు సేకరణ


