హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ అప్పగింత

ASF: చింతలమానేపల్లిలోని బారేగూడకు చెందిన ఆదే సంతోష్ పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌ను పోలీసులు రికవరీ చేసి ఆదివారం అప్పగించారు. SI కమలాకర్ ఆధ్వర్యంలో CEIR పోర్టల్ ద్వారా ఫోన్‌ను బ్లాక్ చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం ఫోన్ గుర్తించి సంతోష్‌కు అందజేశారు. పోలీసుల పనితీరును స్థానికులు అభినందించారు. హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, అధికారి దివాకర్ పాల్గొన్నారు.