హైదరాబాద్: 28°C
తెలంగాణ

రామప్పను సందర్శించిన జర్మనీ దేశస్తులు

MLG: వెంకటాపూర్ మండలం పాలంపేటలోని ప్రపంచ ప్రఖ్యాత రామప్ప దేవాలయాన్ని ఆదివారం జర్మనీ దేశస్తులు సందర్శించారు. ఆలయ పూజారులు వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం గైడ్ విజయ్ రామప్ప ఆలయ శిల్పకళా సౌందర్యం, చారిత్రక విశిష్టతను జర్మనీ దేశస్తులకు వివరించారు. రామప్ప అద్భుత కట్టడాలు పర్యటకులను విశేషంగా ఆకట్టుకున్నాయని తెలిపారు.