హైదరాబాద్: 28°C
తెలంగాణ

'వినాయక చవితి ఏర్పాట్లపై కీలక సమావేశం'

KMR: వినాయక చవితి నవరాత్రి ఉత్సవ కమిటీ సమావేశాన్ని రేపు నిర్వహిస్తున్నట్లు ఎస్సై అనిల్ తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో జరిగే సమావేశానికి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. భిక్నూరు మండలంలోని వినాయక ఉత్సవ కమిటీల అధ్యక్ష, కార్యదర్శులు, యువజన సంఘాల సభ్యులు తప్పక హాజరు కావాలని కోరారు.