KKD: ఆదివారం సెలవు కావడంతో కాకినాడ ఎన్టీఆర్ బీచ్‌కు భారీగా సందర్శకులు తరలి రావడంతో తిమ్మాపురం, మెరైన్ పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ జి. బిందు మాధవ్ ఆదేశాలతో డ్రోన్ కెమెరాలతో బీచ్ పరిసరాల్లో జనసమ్మర్దం, అనుమానాస్పద కదలికలను పర్యవేక్షించారు. ప్రజలు పోలీసుల భద్రతా సూచనలు పాటించాలని ఎస్పీ సూచించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఎన్టీఆర్ బీచ్‌లో డ్రోన్ కెమెరాలతో నిఘా


