హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొనసాగుతున్న రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు

NRML: పట్టణంలోని ఎన్టీఆర్ మినిస్టేడియంలో రాష్ట్ర ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలబాలికల రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు ఆదివారం రెండో రోజు ఉత్సాహంగా కొనసాగాయి. రాష్ట్రంలోని 22 జిల్లాల నుంచి క్రీడాకారులు పోటీలకు హాజరయ్యారు. రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ పోటీలు ఆదివారంతో ముగుస్తాయని నిర్మల్ జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడు వన్నెల భూమన్న తెలిపారు.