హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెండింగ్ పనులు పూర్తి చేయాలి: మాజీ ZPTC

MNCL: బెల్లంపల్లి మండలం తాళ్ల గురజాల నూతన గ్రామపంచాయతీ భవనాన్ని మాజీ ZPTC రామచందర్ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ పెండింగ్ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సోమగూడెం ఉపసర్పంచ్ భూమన్న, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.