హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వానల కోసం కప్పల ఊరేగింపు

AKP: వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ జంపపాలెం గ్రామంలో ఆదివారం మహిళలు, పెద్దలు కప్పల ఊరేగింపు నిర్వహించారు. కప్పలకు పసుపు, కుంకుమలతో పూజలు చేసి గంపలో ఉంచి మేళతాళాలతో ఊరేగించారు. గ్రామస్థులు కప్పలపై, ఊరేగింపులో పాల్గొన్న వారిపై నీళ్లు పోశారు. పాడిపంటలు పచ్చగా ఉండాలని, చెరువులు నిండాలని వరుణదేవుడిని వేడుకున్నారు. వేడుకలో రైతులు, మహిళలు, పిల్లలు ఉన్నారు.