BDK: దమ్మపేట (M) మొద్దులగూడెం ఎస్సీ కాలనీలో తాగునీటి సమస్యపై ఎమ్మెల్యే జారే ఆదినారాయణ వెంటనే స్పందించారు. రెండు రోజులుగా నీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాలనీ ప్రజల సమస్యను కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కొత్త బోర్‌వెల్ మంజూరు చేయించి బోర్ వేయడంతో నీటి సమస్యకు పరిష్కారం లభించింది. ఎమ్మెల్యేకు కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు
తెలంగాణ
ఎట్టకేలకు తాగునీటి సమస్యకు పరిష్కారం


