హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేణుక అంకమ్మతల్లి గుడి ప్రతిష్ఠ వేడుక

కృష్ణా: తోట్లవల్లూరు మండలం చాగంటిపాడు శివారు పిల్లివానిలంకలో పిల్లివారి రేణుక అంకమ్మతల్లి ఆలయ ప్రతిష్ఠ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి MLA వర్ల కుమార్ రాజా ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రతిష్ఠ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.