హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బందరు కోట రోడ్డుకు కొత్త భద్రతా చర్యలు

కృష్ణా: మచిలీపట్నం బందరు కోట మార్గంలో రోడ్డుకు ఇరువైపులా ఇనుప కంచె ఏర్పాటు పనులను మంత్రి కొల్లు రవీంద్ర పరిశీలించారు. రోడ్డుపై ప్రయాణికులకు, వ్యవసాయ క్షేత్రాల్లోని వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రత్యేకంగా రోడ్లపై పశువుల సంచారాన్ని అడ్డుకునేలా కంచె ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు.