హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'స్థానిక ఎన్నికల్లో కూటమితో కలిసి ముందడుగు'

ELR: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి భాగస్వామ్య పక్షాలతో కలిసి ఏకతాటిపై ముందుకు సాగుతామని బిజేపి జిల్లా అధ్యక్షుడు విక్రమ్ కిషోర్ తెలిపారు. ఆదివారం కంఠమనేనివారిగూడెంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో జిల్లాలో బిజేపి బలం గణనీయంగా పెరిగిందన్నారు.