హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పంట పొలాల్లో చోరీలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై

KDP: పంట పొలాల్లో రాత్రివేళ జరుగుతున్న చోరీల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని SI హారిక సూచించారు. ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఆమె మాట్లాడారు. శివునిపల్లె, పేరయ్యగారిపల్లె గ్రామాల్లో పొలాల్లోని విద్యుత్‌ వైర్లు చోరీ చేస్తున్నట్లు రైతుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమాచారం అందించాలని ఆమె కోరారు.