హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాంబి రెడ్డి 2 సినిమాపై పోలీసులకు ఫిర్యాదు

KNR: కరీంనగర్‌లో తెలంగాణ ఉద్యమ గాయకురాలు తేలు విజయ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను రచించి, పాడిన 'పున్నమ్మ పున్నమ్మ' పాటను తన అనుమతి లేకుండా జాంబి రెడ్డి 2 సినిమాలో ఉపయోగించారని ఆరోపించారు. పాటను వెంటనే తొలగించి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కళాకారుల హక్కులను కాపాడాలని తెలంగాణ రక్షణ సేన నేతలు డిమాండ్ చేశారు.