హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సత్ప్రవర్తనతో మెలగకపోతే చర్యలు: ఎస్సై

WG: సత్ప్రవర్తనతో మెలగకపోతే చర్యలు తప్పవని ఆకివీడు ఎస్సై శుభశేఖర్ హెచ్చరించారు. ఆదివారం మండల పరిధిలోని రౌడీషీటర్లు, నేర చరిత్ర కలిగిన వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. రానున్న స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రౌడీషీటర్లు తమ పరిధిలోనే ఉండాలని సూచించారు. ఎవరైనా హద్దు మీరి అరాచకాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.