హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వాడపల్లిలో ఆన్నదాన భవనం ప్రారంభం

కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో నూతనంగా నిర్మించిన వకుళామాత అన్నదాన భవనాన్ని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఆదివారం ప్రారంభించారు. అనంతరం భవనాన్ని పరిశీలించి, భక్తులకు అందుతున్న అన్నప్రసాద సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, తదితరులు పాల్గొన్నారు.