WG: వీరవాసరం మండలం తోలేరు జడ్పీ హైస్కూల్‌కు స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అవార్డు దక్కింది. భీమవరంలో నిర్వహించిన కార్యక్రమంలో డీఈఓ అనిల్ కుమార్ అవార్డును అందజేసినట్లు హెచ్ఎం గెడ్డం కిషోర్ తెలిపారు. జిల్లాలోని 250 పాఠశాలల్లో ఐదు పాఠశాలలు ఎంపిక కాగా, వాటిలో తోలేరు పాఠశాల నిలిచింది. నాలుగోసారి ఈ అవార్డు సాధించినట్లు పీడీ పూడి శ్రీనివాస్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
తోలేరు జడ్పీ హైస్కూల్‌కు స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అవార్డు


