హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆలయ పునర్నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన

నెల్లూరు నవాబుపేటలోని ప్రాచీన బలిజ వారి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి మంత్రి పొంగూరు నారాయణ దంపతులు శంకుస్థాపన చేశారు. రూ.1.01 కోట్ల అంచనా వ్యయంతో ఆలయ పునర్నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. 2019లో ఆలయ స్థల సేకరణకు రూ.28 లక్షలు అందించామని, ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని పేర్కొన్నారు.