హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మావుళ్లమ్మ జాతరను ప్రారంభించిన ఎమ్మెల్యే

W.G: భీమవరంలో వాడవాడలా శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు నగరంలోని మూడు ప్రాంతాల్లో జాతరలను లాంఛనంగా ప్రారంభించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సంప్రదాయ బాణసంచా కాల్పులు, శక్తి వేషధారణల మధ్య జాతర వేడుకలను ప్రారంభించారు.