హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దేవలో CPS విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్

WG: పెనుగొండ మండలం దేవలో సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆదివారం సమావేశమయ్యాయి. ఉద్యోగ సంఘ నాయకుడు గణేష్ మాట్లాడుతూ.. సీపీఎస్ విధానం ఉద్యోగ విరమణ అనంతరం సామాజిక, ఆర్థిక భద్రత లేకుండా చేస్తోందన్నారు. విధానానికి వ్యతిరేకంగా సెప్టెంబర్ 1న విజయవాడలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.