హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ట్రాన్స్‌ఫార్మర్ల చోరీతో రైతుల్లో ఆందోళన

KDP: ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు, సాగునీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ట్రాన్స్‌ఫార్మర్ల చోరీలు మరింత నష్టాన్ని మిగులుస్తున్నాయి. ముద్దనూరు మండలంలోని బొందలకుంట, కొలవలి గ్రామాల పొలాల్లో ఏర్పాటు చేసిన వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్లను అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. వరుస చోరీలతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు.