హైదరాబాద్: 28°C
క్రీడలు

ఇంగ్లండ్ కౌంటీల్లో ఆకిబ్ నబీ అరంగేట్రం

జమ్మూ కాశ్మీర్ ఫాస్ట్ బౌలర్ ఆకిబ్ నబీ తొలిసారి ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. బీసీసీఐ ప్రత్యేక చొరవతో కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో సర్రే క్రికెట్ క్లబ్‌తో అతను స్వల్పకాలిక ఒప్పందం కుదుర్చుకున్నాడు. సర్రే తరఫున మూడు మ్యాచ్‌లు ఆడనున్న ఆకిబ్, సెప్టెంబర్ 2న యార్క్‌షైర్‌తో జరిగే మ్యాచ్‌ ద్వారా అరంగేట్రం చేయనున్నాడు.