హైదరాబాద్: 28°C
క్రీడలు

డ్వేన్ బ్రావోకు అరుదైన గౌరవం

కరేబియన్ ప్రీమియర్ లీగ్ (CPL 2026)లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ మాజీ ఆల్-రౌండర్ డ్వేన్ బ్రావోకు అరుదైన గౌరవం దక్కింది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో బ్రావో ఐకానిక్ '47' నంబర్ జెర్సీని ఫ్రాంచైజీ రిటైర్ చేసింది. ప్రస్తుతం జట్టు ప్రధాన కోచ్‌గా సేవలందిస్తున్న బ్రావో సేవలను గుర్తించి 'సర్ ఛాంపియన్' బిరుదుతో ఈ ఘనతను అందించారు.