హైదరాబాద్: 28°C
క్రీడలు

రవిచంద్రన్ అద్భుత క్యాచ్.. వీడియో వైరల్ 

దులీప్ ట్రోఫీ సెమీఫైనల్‌లో నార్త్ జోన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సౌత్ జోన్ ఆటగాడు స్మరన్ రవిచంద్రన్ అద్భుతమైన క్యాచ్‌తో మెరిశాడు. శ్రేయస్ గోపాల్ బౌలింగ్‌లో అబ్దుల్ సమద్ కొట్టిన కట్ షాట్‌ను ఫస్ట్ స్లిప్‌లో ఉన్న స్మరన్.. కుడివైపునకు డైవ్ చేస్తూ రెండు చేతులతో ఒడిసిపట్టాడు. ఈ అసాధారణ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.