హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: తీజ్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

KMR: లింగంపేటలో ఆదివారం బంజారాల సంస్కృతికి ప్రతీక అయిన తీజ్ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తీజ్ మన సంప్రదాయాలకు ప్రతీక అని, పూర్వీకుల ఆచారాలను భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు. మహిళలు, యువత సంప్రదాయ దుస్తుల్లో కోలాటాలు, నృత్యాలతో సందడి చేశారు.