హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'యువతలో రాజకీయ చైతన్యం రావాలి'

NTR: ప్రజాస్వామ్యంలో మార్పు రావాలంటే ముందుగా ప్రజల్లో ముఖ్యంగా యువతలో రాజకీయ చైతన్యం రావాలని ఎంపీటీసీ బర్రె ఉదయ్ కిరణ్ అన్నారు. కంచికచర్లలోని తన సెగ్మెంట్ పరిధిలో నిర్వహించిన ఓటరు నమోదు కార్యక్రమానికి యువత నుంచి భారీ స్పందన లభించింది. సుమారు 80 మంది కొత్త యువ ఓటర్లు తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకున్నారని పేర్కొన్నారు.