హైదరాబాద్: 28°C
తెలంగాణ

మృతుడి కుటుంబానికి ఆర్థిక చేయూత

NZB: వర్ని మండలం తగిలేపల్లి గ్రామ మాజీ సర్పంచ్ వెంకన్న ఇటీవల హత్యకు గురికావడంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన నివాసంలో వెంకన్న కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వెంకన్న భార్యకు రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేశారు. కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.