హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీటీడీకి విలువైన పరికరాల విరాళం

తిరుపతికి చెందిన మురళీ టీటీడీకి రూ.12 లక్షల విలువైన సీసీ కెమెరాలు, వెబ్ కెమెరాలు, ప్రింటర్లను విరాళంగా అందించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో పోటు పేష్కార్ మునిరత్నంకు పరికరాలను అందజేశారు. భక్తుల భద్రతను మరింత పటిష్టం చేయడంతో పాటు టీటీడీ వివిధ విభాగాల రోజువారీ కార్యకలాపాలకు ఈ పరికరాలు ఉపయోగపడనున్నాయి. దాత మురళీని టీటీడీ అధికారులు అభినందించారు.