హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సంతేబిందునూరులో కనకదాసు విగ్రహ ప్రతిష్ఠ

సత్యసాయి: హిందూపురం రూరల్ మండలం సంతేబిందునూరు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన కనకదాసు విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సహకారంతో, ఆయన వ్యక్తిగత కార్యదర్శి బాలాజీ అందించిన రాతి విగ్రహాన్ని గ్రామంలో ప్రతిష్ఠించి పూజలు చేశారు. కురుబ సమాజం ఐక్యంగా ఉండి కనకదాసు మార్గంలో పయనించాలని నాయకులు పిలుపునిచ్చారు.